స్టేజీపై డ్యాన్స్‌తో రచ్చచేస్తున్న బామ్మ.. వైరల్‌

Video Of Desi Dadi Dancing On Spanish Rap Song Goes Viral - Sakshi

దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి దేశమంతా విలవిల్లాడుతోంది. కాగా, గత 15 నెలలుగా ప్రజలందరూ వైరస్‌ భయంతోనే గడుపుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా.. ఏదైనా శుభకార్యాలకు హాజరవ్వాలన్నా తెగ భయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో బామ్మ చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిలో బామ్మ స్పానిష్‌ పాటపై స్టెప్పులేస్తూ తెగ రచ్చ చేస్తోంది. పాపిచు.. పాట లిరిక్స్‌ కు తగ్గట్టుగా హావభావాలను పండించింది.

ఆమె ఎనర్జీ లెవల్స్‌ చూసి అక్కడి వారంతా ఆశ్చర్యపడుతున్నారు. ఆమె హుషారుతనం అక్కడి వారిని కట్టి పడేస్తోంది. దీంతో అక్కడి వారంతా బామ్మ చుట్టూచేరి మరీ ఆమెను మరింత ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో చూసిన నెటిజన్లు వావ్‌... బామ్మ ఏంత బాగా డ్యాన్స్‌ చేస్తోంది.. బామ్మను చూసి డ్యాన్స్‌ నేర్చుకోవాల్సిందే.. మీ డ్యాన్స్‌కు హ్యాట్సాఫ్‌ అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ పాటను 2003లో పనామేనియన్‌ రాపర్‌ లోర్నా తొలిసారి విడుదల చేశాడు. ఇది అనేక దేశాలను ఓ ఊపు ఊపేసింది. స్పానిష్‌లో పాపిచులో అంటే  మగవారికి ప్రియమైన అన్నపదంగా ఉపయోగిస్తారు. కాగా కరోనా నుంచి ఉపశమనం కోసం ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌ పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌ తెగ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top