180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన ‘వందే భారత్‌’ రైలు

Vande Bharat Train Breached 180 KMPH Speed Limit During Trial Run - Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వందేభారత్‌ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు అయిన వందేభారత్‌ మూడో ప్రాజెక్ట్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు అధికారులు. ఈ ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసి ఔరా అనిపించింది. ట్రయల్‌ రన్‌లో రైలు వేగాన్ని చూపుతున్న వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

2019లో తొలి వందేభారత్‌ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ- వారణాసి మధ్య దీన్ని నడుపుతున్నారు. ఢిల్లీ- జమ్మూలోని వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు. తాజాగా రాజస్థాన్‌లోని కోటా- మధ్యప్రదేశ్‌లోని నగ్దా మధ్య మూడో రైలు నడపనున్న నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది ట్రైను. రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్‌ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌ చేసి దాన్ని రైలు కిటికీ పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం.

ఇదీ చదవండి: వచ్చేస్తున్నాయ్‌ వందేభారత్‌ రైళ్లు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top