సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు

Uttarakhand CM Trivendra Singh Rawat Admitted In Delhi AIIMS - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. సీఎంకు ఛాతీలో ఇన్ఫెక్షన్‌ పెరిగినట్లు ఎయిమ్స్‌ వర్గాలు నిర్ధారించాయి. కాగా, ఈనెల 18న సీఎం రావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే, ఆయనకు జ్వరంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం డెహ్రాడూన్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నుంచి నేడు ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. ఇక కేబినెట్‌ భేటీలో పాల్గొన్న మంత్రి సాత్పాల్‌ మహరాజ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో జూన్‌ 1న ఓసారి క్వారంటైన్‌కు వెళ్లిన సీఎం, తన కార్యాలయంలో పనిచేసే ఓఎస్‌డీకి కరోనా సోకడంతో ఆగస్టు 26న మరోసారి ఐసోలేషన్‌కు వెళ్లారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top