డిఫెన్స్‌ అకాడెమీలోకి మహిళలు..

Union Govt Allows Women In NDA Entrance Examination - Sakshi

 ఈ ఏడాది మే లోపు నోటిఫికేషన్‌

న్యూఢిల్లీ: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షలకు మహిళలను అనుమతించనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు మంగ ళవారం తెలిపింది. ఈ పరీక్ష నిర్వహణను సజావుగా జరిపేందుకు అవసరమైన చర్యలను చేపడుతు న్నట్లు చెప్పింది. మూడు రకాల రక్షణ బలగాల్లో మహిళలను ప్రవేశపెట్టనున్న ట్లు పేర్కొంది.  

ఈ మేరకు సుప్రీంకోర్టులో రక్షణ శాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. పురుష అభ్యర్థులకు ఉన్నట్లే మహిళా అభ్యర్థులకు కూడా ఎత్తు, బరువు వంటి భౌతిక పరామితులను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఆ పరామితులను నిర్ణయిస్తున్నట్లు తెలిపింది. ఎన్డీఏ ప్రవేశ పరీక్ష సంవత్సరానికి రెండు సార్లు జరుగుతుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top