సముద్రంలో చెస్‌.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి, పావు గంటకు ఓ గేమ్‌ చొప్పున

Underwater Chess In Chennai Takes Battle Of Minds To New Depths - Sakshi

కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్‌ ఆడారు. అరవింద్‌ తరుణ్‌ శ్రీ అనే టెంపుల్‌ అడ్వెంచర్స్‌ డైవింగ్‌ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు.

స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్‌ చేశారు. పావు గంటకు ఓ గేమ్‌ చొప్పున రెండు గంటల పాటు చెస్‌ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్‌ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top