భారత త్రివిధ దళాల్లో మరో చారిత్రక ఘట్టం

Two Indian Women Army Officers Selected to Train as Combat Helicopter Pilots - Sakshi

యుద్ధ హెలికాప్టర్ల పైలట్లుగా ఇద్దరు మహిళలు ఎంపిక

వచ్చే ఏడాది జూలై నుంచి యుద్ధ విమానాల్ని నడిపే అవకాశం

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో మహిళల ప్రాతినిధ్యంపై మరో చారిత్రక ఘట్టమిది. యుద్ధ హెలికాప్టర్‌ పైలట్లుగా శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళా అధికారుల్ని ఆర్మీ ఎంపిక చేసింది. మహిళల్ని యుద్ధ విమానాలకు పైలట్లుగా నియమించాలన్న ప్రతిపాదనలకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవాణె ఆమోదముద్ర వేసిన ఆరు నెలల్లోనే మహిళా పైలెట్ల ఎంపిక జరిగింది. వైమానిక విభాగంలో యుద్ధ హెలికాప్టర్లను నడపడంలో శిక్షణ ఇవ్వడానికి ఇద్దరు మహిళల్ని ఎంపిక చేసినట్టుగా ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలోని నాసిక్‌లో కంబాట్‌ ఆర్మీ ఏవియేషన్‌ ట్రైనింగ్‌ స్కూలులో వారిద్దరికీ శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. 15 మంది మహిళా అధికారులు ఏవియేషన్‌ విభాగంలో చేరడానికి ముందుకు వస్తే కఠినమైన పరీక్షల అనంతరం ఇద్దరు మాత్రమే ఇందుకు అర్హత సంపాదించారని ఆ అధికారులు వివరించారు. శిక్షణ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది జూలై నుంచి వారికి యుద్ధ విమానాల్ని నడిపే అవకాశం వస్తుంది. 2018లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అవని చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.  

చదవండి: 
వైరల్‌: చావు నుంచి తప్పించుకున్న మహిళలు

గాలి కోసం 10 వేల మొక్కలు నాటాడు.. చివరికి గాలి అందక కన్నుమూశాడు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top