తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్‌ అభిమానం | TVK Vijay Shows YS Jagan Photo In Tamil Nadu Election Campaign | Sakshi
Sakshi News home page

తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్‌ అభిమానం

Apr 22 2026 8:49 AM | Updated on Apr 22 2026 9:00 AM

TVK Vijay Shows YS Jagan Photo In Tamil Nadu Election Campaign

జననేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లిన అభిమానులు వైఎస్‌ జగన్‌ భారీ సంఖ్యలో తరలివచ్చి వెన్నంటే ఉంటారు. తమ అభిమాన నేతపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, తమిళనాడు ఎన్నికల్లో సైతం వైఎస్‌ జగన్‌ పేరు మారుమోగుతోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్‌.. వైఎస్‌ జగన్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జగన్‌తో కలిసి ఉన్న ఫొటోను విజయ్‌ ప్రదర్శించారు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారిలో జోష్‌ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేడి మధ్యలో, ప్రచార రథంపై నిలబడి ఉన్న విజయ్‌ ఒక్కసారిగా వైఎస్‌ జగన్‌ ఫొటోను పైకి ఎత్తి చూపించారు. ఆ ఫొటోను పైకెత్తిన క్షణంలోనే సభ మొత్తం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “జగన్.. జగన్‌” అంటూ జనం గళం ఉప్పొంగిపోయింది. అది సాధారణ స్పందన కాదు. ఒక నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ.. ఒక్క క్షణంలో బయటపడిన ఎమోషన్. అది ఒక ఫొటో మాత్రమే అయినా, స్పందన మాత్రం తుఫాన్‌లా ఎగిసిపడింది. అక్కడున్న వారంతా జగనన్న సీఎం అంటూ నినాదాలు చేశారు.

విజయ్ ఫోటో ఎత్తిన తీరు.. జనం ఇచ్చిన ఆ రియాక్షన్.. ఈ రెండూ కలిసిన ఆ క్షణం నిజంగా ప్రజల గుండెల్లో “జగన్” అనే పేరు ఎంత లోతుగా ఉందో చూపించింది. ఇదీ జగన్‌ అంటే ప్రజల్లో గుండెల్లో ప్రత్యేక అభిమానమని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం.. ఒక ఇంపాక్ట్ అని మరోసారి రుజువైంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement