వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు‌!

Tripat Singh Inspires People With Fitness Journey In Mumbai - Sakshi

చంఢీగఢ్‌: కాలం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. అయితే ఓ 70 ఏళ్లు దాటిన మనిషి ఏం చేస్తాడు.. చాలా వరకు కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ చంఢీగఢ్‌కి చెందిన ఈ 76 ఏళ్ల త్రిపాత్‌ మాత్రం ఫిట్‌నెస్‌ ఫీట్‌లతో ఇరదీస్తున్నాడు. "పునరాగమనం ఎల్లప్పుడూ ఎదురుదెబ్బ కంటే గొప్పది!" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 39, 549 మంది వీక్షించగా..వందల మంది తాతను ప్రశంసిస్తూ కామెంట్‌ చేస్తున్నారు.  ఈ వీడియోలో త్రిపాత్‌ వివిధ రకాల ఫీట్‌లతో ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తూ కనిపిస్తాడు. అతడి కండలను చూపిస్తూ.. ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. 

కాగా 1999వ సంవత్సరంలో త్రిపాత్‌ భార్య మంజీత్‌ చనిపోయింది. దాంతో ఆయన గుండెలు బాదుకున్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. వ్యాపారాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో మంచానికి పరితమయ్యాడు. అయితే ఆయన పరిస్థితి చూసి కొంత మంది సలహా ఇవ్వడంతో వ్యాయామం చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం మంజీత్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.
 

(చదవండి: దారుణం: కావలసినంత కట్నం తేలేదని కాల్పులు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top