క్యాట్‌ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్‌

Tribunal Will Collapse: Supreme Court on Vacant Posts - Sakshi

న్యూఢిల్లీ: సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ (క్యాట్‌)లో భారీ ఖాళీలపై సుప్రీంకోర్టు సీరియసైంది. ట్రిబ్యునల్‌ కుప్పకూలుతోందంటూ వ్యాఖ్యానించింది. క్యాట్‌లో ఖాళీల వల్ల ఇతర ధర్మాసనాలకు చెందిన జడ్జిలు హైబ్రిడ్, ప్రత్యక్ష, వర్చువల్‌ పద్ధతుల్లో విచారణ జరుపుతున్నారంటూ కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

‘క్యాట్‌కు కేటాయించిన 69 మంది జడ్జీ పోస్టులకు గాను చైర్‌పర్సన్‌తో కలిపి ఏకంగా 43 ఖాళీలున్నాయి. మిగతా వారూ రిటైరైతే క్యాట్‌ పూర్తిగా కుప్పకూలిపోతుంది’ అంది. జూలై 26న తదుపరి విచారణకల్లా ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశించింది.
చదవండి: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top