హిందువేతరులకు ఇక్కడ ట్రీట్‌మెంట్‌ చేస్తారా?.. రతన్‌ టాటాకు గడ్కరీ చెప్పిన సమాధానం ఇదే!

Told Ratan Tata Once That RSS Does Not Discriminate Says Gadkari - Sakshi

పుణే: బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికరమైన ఓ ఘటనను మీడియాతో పంచుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటా, ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలు చేయడంతో.. దానికి ప్రతి సమాధానం ఇచ్చి  గుర్తు చేసుకున్నారు.     

ఆ సమయంలో నేను మహారాష్ట్ర మంత్రిగా ఉన్నా. ఔరంగాబాద్‌లో ఆరెస్సెస్‌ చీఫ్‌, దివంగత కేబీ హెగ్డేవార్‌ పేరు మీద ఓ ఆస్పత్రిని ప్రారంభించాం. దాని ప్రారంభోత్సవానికి రతన్‌ టాటాను ఆహ్వానించాం. సంతోషంగా ఆయన వచ్చారు. అయితే కార్యక్రమం మొదలయ్యే టైంలో.. ఈ ఆస్పత్రి కేవలం హిందూ కమ్యూనిటీ కోసమేనా? అని అడిగారు, ఎందుకలా అడిగారు? అని నేను అన్నాను. దానికి ఆయన.. ఇది ఆరెస్సెస్‌ వాళ్లకు చెందింది కదా అన్నారు. 

అప్పుడు నేను ఇది అన్నీ కమ్యూనిటీలకు చెందిన ఆస్పత్రి అని, ఆరెస్సెస్‌కు అలాంటి వివక్ష ఏం ఉండదని చెప్పారు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఈ విషయమై చాలాసేపు సంభాషణ జరిగింది. చివరికి నా వివరణతో ఆయన సంతోషించారు అని గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆరెస్సెస్‌ ఇప్పటికీ అలాంటి వివక్షకు దూరంగానే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.    

గురువారం పుణేలో అప్లా ఘర్‌ సేవా సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆస్పత్రి ప్రారంభ కార్యక్రమంలో గడ్కరీ పై ఘటనను గుర్తు చేసుకున్నారు. అలాగే దేశం ఆదివాసీల దీనస్థితిపైనా సంఘీభావం వ్యక్తం చేసిన ఆయన.. ఆరోగ్య, విద్యా రంగాల్లో వాళ్లకు అందుతున్న వసతుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గడ్కరీ.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top