Thief Breaks Into House to Steal Cycle, You Cant Stop Laughing At What Happens Next - Sakshi
Sakshi News home page

Viral Video: దర్జాగా ఇంట్లోకి వెళ్లి సైకిల్‌ దొంగతనం.. కొద్దిసేపటికే సీన్‌ రివర్స్‌

Nov 21 2021 5:36 PM | Updated on Nov 21 2021 6:53 PM

Thief Breaks Into House to Steal Cycle, You Cant Stop Laughing At What Happens Next - Sakshi

దొంగతనం చేయడం కూడా ఓ కళే. అది అందరికి అంత ఈజీగా అయ్యే పని కాదు. పక్కా ప్లాన్‌, అదృష్టం కలిసి ఉంటేనే సాధ్యం  అవుతుంది. అయితే ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా కొన్నిస్లార్లు దొంగతనాలు ఫెయిల్‌ అవుతాయి. పోయిన పని జరగకపోవమే కాకుండా అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా అలాంటి అనుభవమే ఓ దొంగకు ఎదురైంది. ఇంటి తాళం వేయకపోవడంతో పట్టపగలే దర్జాగా ఇంటిలోకి నడుచుకుంటూ వెళ్లాడు. ఇంటి చుట్టూ ఎవరైనా ఉన్నారా లేరా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో వరండాలో ఓ స్కూటీ, సైకిల్‌ పార్క్‌ చేసి ఉండటం దొంగ కంటపడింది. ఇంకేముంది టక్కున అక్కడికి వెళ్లి సైకిల్‌ తీసుకొని గేట్‌ నుంచి బయటకు పరుగెత్తాడు.
చదవండి: మనుషులే కాదు శునకం కూడా దెయ్యం అవుతుందా?

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ అసలైన కథ ఇప్పుడే మొదలైంది. దొంగ సైకిల్‌ ఎత్తుకెళ్లడం యాజమాని చూశాడు. దీంతో వెంటనే దొంగ వెంట పరుగెత్తి అతన్ని రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం దొంగ నుంచి తన సైకిల్‌ను తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ మీమ్స్‌ పేజ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో గాసోలినా పాట ప్లే అవుతుండటం మరింత ఫన్నీగా మార్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ‘అరె.. వీడెవడికో దొంగతనంలో అంత అనుభవం లేనట్టు ఉంది. అడ్డంగా బుక్కైయ్యాడు. ఇకనైనా  జాగ్రత్తగా ప్లాన్‌ చేయి’. అంటూ ఫన్నీగా కామెంట్స్‌ చేస్తున్నారు.
చదవండి: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే

Advertisement
 
Advertisement
Advertisement