ఒకటి రెండూ కాదు.. వందేళ్లకు పైబడ్డ చరిత్ర, మరెన్నో విశేషాలు!

These Restaurants Have More Than A 100 Years Old History Across India - Sakshi

మార్పు అనేది ఓ కొత్త సంస్కృతికి ఆహ్వానం పలుకుతుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే హోటల్‌ రంగంలో కూడా ఆ మార్పు మొదలైంది. మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. వివిధ పనులపై వెళ్లే క్రమంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండాల్సి వచ్చింది.  దీంతో చిన్న చిన్న హోటల్స్‌ నుంచి ఫైవ్‌, సెవెన్‌ స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్‌లు వచ్చేశాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా గడిచిన కాలాన్ని అంత తొందరగా మరచిపోనివ్వదు చరిత్ర. అలాగే కొన్ని భారతీయ హోటల్స్‌కు ఓ వందేళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. వాటి వివరాల ఏంటో ఓ సారి చూద్దాం.. 

పర్వతాలను చూస్తూ.. ఓ పట్టు పట్టొచ్చు!
పశ్చిమ బెంగాల్‌లోని గ్లెనరీ అనే రెస్టారెంట్‌ డార్జిలింగ్‌లోని  కొండ పట్టణ ప్రాంతాల్లో  అత్యంత ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఒకటి.  దీనికి 130 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడి భోజనం అద్భుతంగా ఉంటుదని వినికిడి. విందు ఏర్పాటు కోసం ఓ ప్రత్యేకమైన స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాకుండా గ్లెనరీలో బేకరీ కూడా ఉంది. కొండ ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో పర్వతాలను చూస్తూ విందు ఆరగించడానికి ప్రత్యేక సీట్లను కూడా ఏర్పాటు చేశారు.
 
150 సంవత్సరాల చరిత్ర
ముంబైలోని లియోపోల్డ్ కేఫ్ రెస్టారెంట్, బార్‌కు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగ్రవాదులు  2008 వ సంవత్సరంలో జరిపిన ముంబై దాడుల లిస్టులో ఈ రెస్టారెంట్‌ ఉండటంలో దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఆ భయంకరమైన దాడులకు సంబంధించి భద్రపరిచిన బుల్లెట్ గుర్తులను రెస్టారెంట్‌లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులకు, స్థానికులకు ఎంతో ఇష్టమైనది.

ప్రసిద్థ వ్యక్తులు చేతుల మీదుగా..
కోల్‌కతాలోని ఈ ఇండియన్‌ కాఫీ హౌస్‌ను ప్రసిద్థ వ్యక్తులు సత్యజిత్ రే, మృణాల్ సేన్, అమెరికన్ కవి అలెన్ గిన్స్బర్గ్ 1876లో స్థాపించారు. అయితే ఆల్బర్ట్ హాల్ అనే పేరు గల ఈ రెస్టారెంట్‌ను 1947 తర్వాత కాఫీ హౌస్‌గా పేరు మార్చారు. 

కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయి
ఉత్తర ప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ టుండే కబాబీ తినుబండాగారానికి ఘనమైన చరిత్ర ఉంది. ఈ టుండే కబాబీ 115 సంవత్సరాల పురాతనమైనది.  దీన్ని 1905లో ప్రారంభించారు. ఇక్క 125 రకాల వంటకాలు దొరుకుతాయని చెబుతారు. ఇక్కడి కబాబ్‌లు నోటిలో ఇట్టే కరిగిపోతాయని ప్రతీతి.
చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top