Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Telugu News Breaking News Evening News Roundup 14th September 2022 - Sakshi

1. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి షాక్..
బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇందుకు ఆరు వారాలు గడువిస్తూ నోటీసులు పంపింది. సుబ్రహ్మణ్యస్వామికి కేంద్రం 2016 జనవరిలో ఢిల్లీలో అధికారిక నివాసం కేటాయించింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కంపెనీ పేరుతో లోన్‌ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. లాస్ట్‌ ఫ్టైట్‌ జర్నీ...మిమానంలో క్వీన్‌ మృతదేహాన్ని మోసుకెళ్లి....
బ్రిటన్‌ని సుదీర్ఘకాలం పాలించిన రాణి ఎలిజబెత్‌ సెప్టెంబర్‌ 8న స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె భౌతిక దేహాన్ని ప్రజల సందర్శనార్ధం స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌లోని రాణి అధికారిక నివాసం రుడ్‌హౌస్‌ ప్యాలెస్‌కు తరలించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?
చైనా పైకి కనిపించేంత బలంగా లేదా? పైకి డాబుగా కనిపించే చైనా పరిస్థితి పైన పటారం.. లోన లొటారమేనా? ఆర్ధికంగా అగ్రరాజ్యం అమెరికానే తలదన్నేస్తామనే చైనా ధీమా ఉత్తుత్తిదేనా? అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఇపుడీ ప్రశ్నలే ప్రపంచ ఆర్ధిక రంగ నిపుణులను వెంటాడు తున్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ సమీక్ష
ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. కేసీఆర్‌ సర్కార్‌ను గవర్నర్‌ ఇరుకున పెట్టారా?
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి వార్తలలోకి ఎక్కారు. ఆమె రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలే చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఆమెకు మధ్య విబేధాలు ఏర్పడిన నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేలా ఉన్నాయి.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. నేను సినిమాలు మానేయాలని కోరుకున్నారు, అది బాధించింది: దుల్కర్‌
హీరో దుల్కర్‌ సల్మాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళ నటుడు మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ తనదైన నటన, స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సౌత్‌ స్టార్‌ హీరోలలో ఒక్కడిగా మారాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. దూసుకొస్తున్న రన్‌ మెషీన్‌.. ఆఫ్ఘన్‌పై సెంచరీతో భారీ జంప్‌
టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌ చేశాడు. ఆసియా కప్‌-2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై సూపర్‌ శతకం (61 బంతుల్లో 122 నాటౌట్‌) సాధించి మళ్లీ టాప్‌-10 దిశగా దూసుకొస్తున్నాడు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. బెజోస్‌,మస్క్‌ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?
అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం  కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోతున్నారు.  టాప్‌ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది. ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్  భారీ నష్టాలను చవిచూస్తోంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే..
తలనొప్పికి చాలా సర్వసాధారణమైన కారణం ఆకలి. మనకి ఆకలి వేసినప్పుడు మన శరీరంలోని రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. షుగర్‌ లెవల్స్‌ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి మెదడుకు సిగ్నల్‌ను పంపడం వలన తలనొప్పి వస్తుంది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top