Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే.. | Sakshi
Sakshi News home page

Health Tips: తలనొప్పి.. ప్రధాన కారణాలు! ఇలా చేశారంటే..

Published Wed, Sep 14 2022 4:57 PM

Health Tips: Home Remedies For Headache Cold By Ayurvedic Expert - Sakshi

తలనొప్పి, జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు / అతి సాధారణమైన శారీరక బాధలకు ఇంట్లోనే కొన్నిచిట్కాలున్నాయి

తలనొప్పి
1. తలనొప్పికి చాలా సర్వసాధారణమైన కారణం ఆకలి. మనకి ఆకలి వేసినప్పుడు మన శరీరంలోని రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. షుగర్‌ లెవల్స్‌ పెరిగినపుడు శరీరంలో నరాలు సంకోచించి మెదడుకు సిగ్నల్‌ను పంపడం వలన తలనొప్పి వస్తుంది.

మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ సరిగా అందకపోవచ్చు కూడా. అందుకే ఉదయం కాలి కడుపుతో ఉండరాదు. ఏదో ఒక్కటి తీసుకోవాలి.

2. సాధారణమైన తలనొప్పి చాలా రకాలుగా రావచ్చు. ఎక్కువ అలసిపోయినా, డీ హైడ్రేషన్‌కి గురైనా, జలుబు, జ్వరం సమయాల్లో, ఏదైనా అనవసర విషయాలు ఎక్కువగా ఆలోచిస్తున్నా, నిద్ర చాలకున్నా కూడా తలనొప్పి వస్తుంది. రోజువారీ జీవితంలో ఎక్కడ తేడా వచ్చిందో పసిగడితే సగం పరిష్కారం ఉంటుంది.

ఆ కారణం తెలిస్తే లేదా ఊహించగలిగితే తలనొప్పి నుంచి బయటపడవచ్చు. డీ హైడ్రేషన్ అయితే ఎక్కువ నీళ్లు తాగడం, నిద్ర చాలకుంటే కాసేపు పడుకోవడం ఇలా. ఆ చిన్న చిన్న పనులతో మీ తలనొప్పి తగ్గించుకోవచ్చు. 

3. మామూలుగా ఒక మనిషి సగటున రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటగా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నప్పుడు బాడీ డీహైడ్రేషన్ కు గురిఅవుతుంది.

దాని వల్ల శరీరంలో వేడి శాతం పెరగడం, దాని వల్ల తలనొప్పి రావడం, నీరసంగా ఉండటం, తల తిరగడం, కిడ్నీలో రాళ్లు చేరడం జరుగుతుంది. కిడ్నీలో రాళ్లు వస్తే విపరీతమైన నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు తద్వారా నీరసం, అలాగే గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం, మలబద్ధకం వల్ల ఫైల్స్ ఇలా ఒకదానికొకటి తోడవుతాయి.

ఇప్పుడు నీటిని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం.
1. ముందుగా జలుబు గురించి చూసుకుంటే మీరు కచ్చితంగా నెల రోజుల పాటు మరగబెట్టి చల్లార్చిన గోరువెచ్చని నీటిని తీసుకోండి.
2. ఉదయం లేవగానే రెండు గ్లాసులు నీటిని గోరువెచ్చగా వేడి చేసి బ్రష్ చేయక ముందే తాగాలి (2X200=400 ఎంఎల్‌ )

3. ఏదైనా ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు ఒక గ్లాసు వాటర్ తాగండి, అలాగే భోజనం సమయంలో మంచి నీళ్లను కేవలం గొంతు దిగడం కోసం మాత్రమే తాగండి, ఎక్కువగా తాగవద్దు. భోజనం సమయంలో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి విడుదలయ్యే యాసిడ్‌ను పలుచన చేస్తుంది. దానివల్ల ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానివల్ల గ్యాస్ ట్రబుల్ అల్సర్ వస్తూ ఉంటాయి.

4. మిగతా సమయంలో కచ్చితంగా 3, 4 లీటర్ల నీళ్లను తాగండి. గోరు వెచ్చని నీటిని తీసుకోవడం ఇంకా మంచిది, అలాగే మీరు చల్లటి నీళ్లను (ఫ్రిజ్‌ వాటర్‌ను) తీసుకోవడం వంద శాతం తగ్గించండి.

వీటితో పాటు రోజుకి అరగంట ఏదైనా తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అత్యవసరం అయితే మాత్రం మందులు వాడాలి. వైద్యుడి సలహా ఉత్తమం. సాధ్యమైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది. తీవ్ర మైన ఇబ్బంది సమయంలో సొంత వైద్యం చేసుకోవద్దు. ఏదో ఒక మందు వేసుకొని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు.
-డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
చదవండి: Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!
Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్‌ వల్ల..

Advertisement
 
Advertisement
 
Advertisement