మీ బుజ్జాయికి జలుబు చేసిందా? ఇలా చేస్తే వెంటనే తగ్గుతుంది

How To Treat Common Cold In Toddlers And Kids - Sakshi

అప్పటివరకూ ఎక్కడ ఉంటుందో తెలియదు కాని సీజన్‌ మారగానే ఒక్కసారిగా వచ్చి పట్టేస్తుంది జలుబు. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్‌ నివారణకు చిట్కాలు.

జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్‌ టాబ్లెట్‌లు వాడవచ్చు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిటపట్టించాలి..
రోజులో కనీసం మూడుసార్లయినా పసుపు లేదా, అదుబాటులో ఉండే జండూబామ్‌ వేసుకుని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు ఉపశమనం కలుగుతుంది. 
► ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దల దాకా అందరూ కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లు మాత్రమే తాగితే మంచిది.


► జలుబు లక్షణాలను త్వరగా తగ్గించే వాటిలో ముఖ్యమైనది నిమ్మపండు.. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
► మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి.


► జలుబు తీవ్రంగా ఉన్నప్పుడు ఆవనూనెకు వెల్లుల్లి కలిపి చిన్నారి ఛాతీపైనా, మెడ, వీపు భాగాల్లోనూ మసాజ్‌ చేయాలి.
► పిల్లలు జలుబుతో బాధపడుతున్నప్పుడు వారికి ఆరారగా మంచినీరు తాగిస్తుండటం వల్ల కోల్పోయిన నీటి శాతం భర్తీ అయి శరీరానికి వ్యాధితో సమర్థంగా పోరాడగల శక్తి వస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top