తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ | Telangana CM KCR To Meet Tamil Nadu CM Stalin | Sakshi
Sakshi News home page

KCR TamilNadu Tour: సీఎం స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ

Dec 14 2021 5:46 PM | Updated on Dec 15 2021 7:32 AM

Telangana CM KCR To Meet Tamil Nadu CM Stalin - Sakshi

సాక్షి, చెన్నై/హైదరాబాద్‌: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నైలో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ స్టాలిన్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. పర్యటనలో సీఎం వెంట సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement