‘లడ్డూ కావాలా..’ యూట్యూబర్‌కు యుద్ధ ‍ట్యాంకర్‌తో ఫ్యాన్స్‌ షాక్‌! | Influencer Asks Fans For Diwali Sweets But Gets TVs And Fridges On Cash On Delivery And Flees Home, Check More Details Inside | Sakshi
Sakshi News home page

‘లడ్డూ కావాలా..’ యూట్యూబర్‌కు యుద్ధ ‍ట్యాంకర్‌తో ఫ్యాన్స్‌ షాక్‌!

Oct 13 2026 11:27 AM | Updated on Oct 13 2026 12:23 PM

Influencer Asks For Diwali Sweets Tv Fridge Phone Reached On Cash On Delivery Ran From House

మధురై: తమిళనాడులోని మధురైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీరమణికి అభిమానుల వింత ప్రవర్తన ఊహించని కష్టాలను తెచ్చిపెట్టింది. గతంలో తన ఫాలోవర్లు సమకూర్చిన రూ.6,000తో కేరళ పర్యటన ముగించిన ఆయన, ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా తనకు మిఠాయిల బాక్స్‌ పంపాలని కోరుతూ తన ఇంటి చిరునామాను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

అయితే అభిమానులు స్వీట్లు పంపడానికి బదులుగా ఆయన చిరునామాకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్ల ద్వారా భారీగా క్యాష్-ఆన్-డెలివరీ ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇందులో టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి. చివరికి రూ.1.7 లక్షల విలువైన టీవీతో పాటు స్విగ్గీ, జొమాటోల నుంచి ఆహార పదార్థాలు కూడా ఆయన ఇంటికి పంపసాగారు

జేసీబీలు, రూ.70 కోట్ల విలువైన యుద్ధ ట్యాంకర్లను కూడా ఆయన పేరిట బుక్ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కనిపిస్తున్నాయి. నిరంతరం వస్తున్న డెలివరీ బాయ్స్, ఆందోళన కలిగించే ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన వీరమణి, తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఆగని వేధింపులు, వరుస కాల్స్ భరించలేక ఆయన తన ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి, ఇంటికి తాళం వేసి ఊరు విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన బస్సుల్లో ప్రయాణిస్తూ ఎక్కడో దూరంగా తలదాచుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement