అన్నం పెట్టే రైతులకే అన్నదానం..

Team Of Muslim Men Serving Langar All Day To Protesting Farmers  - Sakshi

ఢిల్లీ- సింఘు సరిహద్దులో ముస్లిం సమాఖ్య సేవలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. అదే సమయంలో  కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు రైతులు తమ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ - సింఘు సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు 25 సభ్యులు కలిగిన ఓ ముస్లిం సమాఖ్య బృందం బాసటగా నిలుస్తోంది. నిరసన చేస్తున్న రైతులందిరికీ ఉచితం ఆహారాన్ని అందిస్తోంది. రైతుల ఆందోళన విరమించేదాకా తమ సేవలు కొనసాగుతాయని, రైతుల కోసం 24x7 గంటలు పనిచేస్తామని ముస్లిం సమాఖ్య బృందం ప్రతినిధి ముబీన్‌ అన్నారు. మనందరికీ అన్నం పెట్టే రైతుకు కష్టం వచ్చినప్పుడు వారిని చూసుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. (8న భారత్‌ బంద్‌)

మరోవైపు అసంపూర్తిగా ముగిసిన చర్చలను మరోసారి కొనసాగించేందుకు రైతులు సంఘాల నాయకులు, కేంద్రం సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే డిసెంబర్‌ 8న భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని మిగిలిన రహదారులను సైతం అడ్డుకునే ప్రణాళిక రూపొందించినట్లు రైతు నాయకుడు హర్విందర్‌ సింగ్‌ లఖ్వాల్‌ తెలిపారు. మోడీ ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థల దిష్టిబొమ్మలను  నేడు దేశవ్యాప్తంగా దగ్ధం చేయాలని నిర్ణయించారు.  (‘మద్దతు’ కోసం మట్టిమనుషుల పోరాటం!! )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top