Tamilnadu: మహిళలకు ఉచిత బస్సు టికెట్‌లు.. ఎందుకంటే!

Tamilnadu: Free RTC Bus Tickets For Women 227 Town Buses Here Is Why - Sakshi

వేలూరు/తమిళనాడు: మహిళలకు సురక్షిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలని, ఆర్థికాభివృద్ధిని పెంచాలని మే 8వ తేదీ నుంచి ప్రభుత్వ టౌన్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అన్ని టౌన్‌ బస్సుల్లోను ప్రస్తుతం ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఈ పథకంలో విల్లుపురం రీజినల్‌ పరిధిలో వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో నడుస్తున్న 227 ప్రభుత్వ టౌన్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించారు.

దీంతో ప్రభుత్వ టౌన్‌ బస్సుల్లో ప్రయాణం చేసే  మహిళల సంఖ్య పెరిగింది. వేలూరు, తిరుపత్తూరు జిల్లాలో టౌన్‌ బస్సుల్లో ప్రయాణం చేసే మహిళలకు ఈనెల 12 నుంచి ఉచిత బస్సు టికెట్‌లను అందజేస్తున్నారు. సహజంగా బస్సు టికెట్‌లో ధర పట్టికలో ఉచిత ప్రయాణం అని ప్రింట్‌ చేసి ఉంది. ఉచిత ప్రయాణ టికెట్‌ను అందజేయడం ద్వారా ఒక బస్సులో రోజుకు ఎంత మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారనే విషయాలు తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top