అన్నింటికీ ఆధార్‌ లింక్‌ తప్పని సరి | Tamil Nadu Govt Says Aadhaar Card Link Necessary For All Subsidiaries | Sakshi
Sakshi News home page

అన్నింటికీ ఆధార్‌ లింక్‌ తప్పని సరి

Dec 18 2022 9:52 AM | Updated on Dec 18 2022 10:03 AM

Tamil Nadu Govt Says Aadhaar Card Link Necessary For All Subsidiaries - Sakshi

సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు ఇతర సేవలకు ఇక ఆధార్‌ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఆధార్‌ కార్డు నంబర్ల ఆధారంగానే ఇక నుంచి లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  రాష్ట్రంలో విద్యుత్‌ కనెక్షన్లకు ఆధార్‌ను లింక్‌ చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

దీంతో ఇప్పటి వరకు కోటి 9 లక్షల మంది తమ కనెక్షన్లకు ఆధార్‌ నంబర్‌ను అనుసంధానించారు. మరో కోటి మందికి పైగా ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాటలో పయనించే విధంగా తాజాగా రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలు, రాయితీలు తదితర ప్రభుత్వ సేవలకు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పని సరి చేశారు. ఇందులో భాగంగా ట్రెజరీల ద్వారా వేతనం, పదవీ విరమణ పెన్షన్, ఇతర పెన్షన్లు పొందుతున్న వారందరూ ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయాలని స్పష్టం చేశారు. కొత్త లబ్ధిదారులు  సైతం ఇకపై దరఖాస్తుతో పాటు ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.  

చదవండి: స్పోర్ట్స్ మీట్‌లో అపశ్రుతి.. విద్యార్థి గొంతులోకి దూసుకెళ్లిన జావెలిన్.. ఐసీయూలో చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement