2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం..

Surat Business Man Buys Land From Moon For Son - Sakshi

సూరత్‌ : రెండు నెలల కుమారుడి కోసం ఏకంగా చంద్రుడిపై స్థలం కొన్నాడో వ్యాపారి. చంద్రుడిపై స్థలం కొన్న మొదటి సూరత్‌ వ్యాపారిగా రికార్డు కెక్కాడు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విజయ్‌ భాయ్‌ కథిరియా అనే వ్యాపారి తన రెండు నెలల కుమారురు నిత్య కోసం చంద్రుడిపై స్థలం కొనాలనుకున్నాడు. ఇందుకోసం అనుమతులు పొందటానికి న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్‌ లూనార్‌ రిజిస్ట్రీకి మెయిల్‌ పెట్టాడు. మార్చి 13వ తేదీన అనుమతులు వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత సదరు కంపెనీనుంచి విజయ్‌ కుమారుడు నిత్య పేరిట ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు వచ్చాయి.

చంద్రుడిపై గల ‘సీ ఆఫ్‌ మస్కోవీ’ అనే ప్రాంతంలో స్థలం కేటాయించారు. మామూలుగా చంద్రుడిపై స్థలం సంపాదించటం సాధ్యపడదు. అయితే చంద్రుడిపై స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్‌ను మాత్రమే సంపాదించగలం. చాలా మంది దీన్ని ఓ విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో రాజస్తాన్‌కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొని భార్యకు బహుమతిగా ఇచ్చాడు.

చదవండి.. చదివించండి : బైకర్‌ను ఆపిన పోలీస్‌.. చేతులెత్తి దండం పెడతారు!

వైరల్‌గా మారిన ప్రపంచ కుబేరుల పాత ఫొటో

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top