బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా శుభాంకర్‌ సర్కార్‌ | Subhankar Sarkar appointed new West Bengal Congress chief | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా శుభాంకర్‌ సర్కార్‌

Sep 22 2024 6:37 AM | Updated on Sep 22 2024 6:37 AM

Subhankar Sarkar appointed new West Bengal Congress chief

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా శుభాంకర్‌ సర్కార్‌ నియమితులయ్యారు. సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 

ఆయన స్థానంలో శుభాంకర్‌ను నియమిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం ఆదేశాలు జారీచేశారు. ఏఐసీసీ కార్యదర్శిగా శుభాంకర్‌ అరుణాచల్‌ ప్రదేశ్, మేఘాలయ, మిజోరంలలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. అధిర్‌ హయాంలో రాష్ట్రస్థాయిలో టీఎంసీతో తీవ్ర విబేధాలు ఉండేవి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement