క్వశ్చన్‌ పేపర్‌ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్‌షీట్‌లో బాలీవుడ్‌ పాటలు ..! | Student writes songs on answer sheet at CHANDIGARH | Sakshi
Sakshi News home page

క్వశ్చన్‌ పేపర్‌ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్‌షీట్‌లో బాలీవుడ్‌ పాటలు ..!

Apr 3 2023 6:24 AM | Updated on Apr 3 2023 6:58 PM

Student writes songs on answer sheet at CHANDIGARH - Sakshi

చండీగఢ్‌: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్‌కు క్వశ్చన్‌ పేపర్‌ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్‌ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్‌ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్‌ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్‌లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్‌ షీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సదరు విద్యార్థి ఆమిర్‌ ఖాన్‌ నటించిన సూపర్‌ హిట్‌ బాలీవుడ్‌ సినిమాలు త్రీ ఇడియట్స్‌లోని ‘గివ్‌ మి సమ్‌ సన్‌షైన్‌...’, పీకేలోని ‘భగవాన్‌ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్‌ను దిద్దిన టీచర్‌ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్‌ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement