శరీరంలోకి గ్లాస్‌తో 10 రోజులుగా నరకం.. వైద్యులు ఏం చేశారంటే?

Steel Glass Inserted Mans Rectum By Drunk Friends In Odisha - Sakshi

భువనేశ్వర్‌: అప్పటి వరకు అంతా కలిసి సరదాగా గడిపారు. ఫూటగా మద్యం సేవించారు. మద్యం మత్తులో అందులోని ఓ స్నేహితుడి పట్ల అరాచకంగా ప్రవర్తించారు. అతడి శరీరం వెనుకభాగంలో స్టీల్‌ గ్లాస్‌ను చొప్పించారు. ఎవరికైనా చెబితే ఏమనుకుంటారోనని ఎవరికీ చెప్పలేదు బాధితుడు. చివరకు నొప్పి తీవ్రం కావటంతో ఆసుపత్రికి వెళ్లగా శాస్త్రచికిత్స చేసి గ్లాస్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ అరాచక చర్య గుజరాత్‌లోని సూరత్‌లో జరగగా.. ఒడిశాలోని గంజాం జిల్లా వైద్యులు బాధితుడికి ఉపశమనం కల్పించారు.

ఇంతకి ఏం జరిగిందంటే?
ఒడిశా, గంజాం జిల్లాలోని బుగుడ బ్లాక్‌ బలిపదార్‌ గ్రామానికి చెందిన బాధితుడు కృష్ణ చంద్రా రౌత్‌(45).. కొద్ది రోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లి అక్కడి టెక్స్‌టైల్‌ మిల్‌లో పని చేస్తున్నాడు. దాదాపు 10 రోజుల క్రితం స్నేహితులతో కలిసి దావత్‌ చేసుకున్నారు. అంతా కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో బాధితుడు కృష్ణ చంద్ర శరీరం వెనుకభాగంలో స్టీల్‌ గ్లాస్‌ చొప్పించారు కీచకులు.

ఆ తర్వాత రోజు నుంచి అతడికి నొప్పి మొదలైంది. కానీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నొప్పి తీవ్రం కావడం వల్ల సూరత్‌ నుంచి అతడి సొంతూరికి వచ్చేశాడు. ఆ తర్వాత మలవిసర్జన కాకపోవటం వల్ల పొట్ట ఉబ్బిపోయింది. నొప్పి భరించలేని స్థితికి చేరటంతో బెర్హమ్‌పుర్‌లోని ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ సైతం గ‍్లాస్‌ విషయం వైద్యులకు తెలపలేదు బాధితుడు. పరీక్షలు నిర్వహించి అసలు విషయం వెల్లడించారు డాక్టర్లు. 

శరీరం వెనుకభాగంలో చిక్కుకుపోయిన స్టీల్‌ గ్లాస్‌ను ఆపరేషన్‌ లేకుండానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. దీంతో సర్జరీ చేసుకోవాల్సిందిగా బాధితుడికి సూచించారు. దానికి అంగీకరించటంతో సుమారు 2.5 గంటల పాటు శ్రమించి శాస్త్ర చికిత్స పూర్తి చేసి గ్లాసును బయటకు తీశారు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపారు. మరో నాలుగైదు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ప్లాస్టిక్‌లా మారిపోయిన యువతి చర్మం.. అదే కారణమా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top