ముక్క వైపే మొగ్గు.. భారత్‌లో తగ్గుతున్న శాకాహారులు! 

Statista Global Consumer Survey: Vegetarianism Is Declining In India - Sakshi

సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగానో లేక ఆరోగ్యకర జీవనాన్ని గడుపుదామనో లేదా జంతు సంరక్షణ కోసమో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాంసాహారం నుంచి శాకాహారం వైపు మళ్లుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. స్టాటిస్టా గ్లోబల్‌ కన్జూమర్‌ సర్వే ప్రకారం.. చాలా దేశాల్లో వెగాన్‌ డైట్‌ ట్రెండ్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. ముఖ్యంగా యూరప్‌లోని కొన్ని దేశాలతోపాటు అమెరికాలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. కానీ భారత్‌లో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేక పరిస్థితి నెలకొంది. దేశంలో సంప్రదాయక శాకాహారులు సర్వభక్షకులుగా మారుతుండటం అంతకంతకూ పెరుగుతోంది.

2018–19లో పట్టణ ప్రాంత భారతీయుల్లో మూడో వంతు మంది తాము శాకాహారులమని పేర్కొనగా 2021–22 నాటికి వారి శాతం ఒక వంతుకు పడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. మొత్తంగా చూస్తే గత మూడేళ్లలో వెజిటేరియన్‌ డైట్‌ ప్రజాదరణ పొందినప్పటికీ కొన్ని దేశాలు మాత్రం నేటికీ మాంసాహారం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నాయి. మెక్సికో, స్పెయిన్‌ వంటి దేశాల్లో నేటికీ శాకాహారం భుజించే వారి శాతం అటుఇటుగా 3 శాతంగా ఉంటోందని అధ్యయనం తెలిపింది. దక్షిణకొరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నప్పటికీ 2018–19లో 0.9 శాతంగా ఉన్న శాకాహారులు 2021–22 నాటికి 2.5 శాతానికి పెరగడం గమనార్హం.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top