‘ము పట్టొ పొడిబి’.. దీనికి అర్థం ఏంటో తెలుసా?

State Level Children Cultural Activities Program In Berhampur Orissa - Sakshi

బరంపురం(భువనేశ్వర్‌): నగరంలోని హిల్‌పట్నా మెయిన్‌రోడ్డులో ఉన్న బిజూ పట్నాయక్‌ సాంస్కృతిక భవనంలో ఒడిశా నాటక సమారోహ సమితి ఆధ్వర్యంలో 3 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిశు నాటక మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా గంజాం జిల్లా బంజనగర్‌ గురుకుల పాఠశాల విద్యార్థులు చేపట్టిన ‘ము పట్టొ పొడిబి’(నేను చదువుకుంటాను) అనే నాటిక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో బరంపురం ఎంపీ చంద్రశేఖర్‌ సాహు, ఎమ్మెల్యే విక్రమ్‌ పండా తదితరులు పాల్గొన్నారు.

మరో ఘటనలో..
రాఖీ ఘెష్‌కు ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారం
భువనేశ్వర్‌: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా పురస్కారం–2021..ది పయనీర్‌ ఇంగ్లిష్‌ జర్నలిస్ట్‌ రాఖీ ఘోష్‌ని వరించింది. వర్చువల్‌ మాధ్యమంలో ఈ పురస్కార ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. సుందరగఢ్‌ ప్రాంతంలో కోవిడ్‌ మృతుల దహన సంస్కారాలను స్వచ్చంధంగా నిర్వహిస్తున్న యుజవన సాంఘిక సేవా సంస్థలపై పత్రికలో రాసిన కథనానికి గాను ఆమెకి ఈ అవార్డుల లభించినట్లు తెలుస్తోంది.

చదవండి: భర్త, కూతురు మృతి.. తోడు నిలిచిన ‘రిక్షా’ కుటుంబం.. బహుమతిగా రూ.కోటి ఆస్తి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top