తినే ఆహారంపై షరతులు ఏంటీ: సిద్ధరామయ్య

Siddaramaiah Says Food Habits My Right  Who Are You To Question Us - Sakshi

సాక్షి, బెంగళూరు: ‘నేను పశు మాంసం తింటా. వద్దని చెప్పడానికి నువ్‌ ఎవరు?’ అని సీఎల్పీ నేత సిద్ధరామయ్య గోహత్య నిషేధ చట్టంపై మండిపడ్డారు. సోమవారం కాంగ్రెస్‌ భవన్‌లో పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడారు. గోహత్య నిషేధం ఆర్డినెన్స్‌ జారీ చేయడం సరికాదన్నారు. ప్రతి ఒక్క రైతూ పశువులను పూజిస్తాడని, అయితే తినే ఆహారంపై షరతులు ఏమిటని అన్నారు. గోహత్య నిషేధం బిల్లు కొత్తదేం కాదని, గత 1964లోనే అమలు చేశారని చెప్పారు.

గో చట్టానికి ఆర్డినెన్స్‌ 
సాక్షి, బెంగళూరు: ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో విధానపరిషత్‌లో ఆమోదం పొందలేకపోయిన గో హత్య నిషేధ చట్టాన్ని యడియూరప్ప ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేయనుంది. సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపారు. మంగళవారం గవర్నర్‌ వజూభాయ్‌వాలా ఆమోదం కోసం పంపుతారు.  

చట్టంలో సవరణలు ఇవీ  
ఈ సందర్బంగా న్యాయమంత్రి మాధుస్వామి మాట్లాడుతూ 1964 గోవధ నిషేధ చట్టంలో 12 ఏళ్లు దాటిన పశువును వధించవచ్చనే వెసులుబాటు ఉందని, దానిని ఈ చట్టంలో రద్దు చేశామని చెప్పారు. గోహత్యకు పాల్పడేవారు, సహకరించేవారు శిక్షార్హులన్నారు. పశుమాంసం తినేవారు, చర్మాల వ్యాపారులపై ఎలాంటి నిర్బంధం ఉండబోదన్నారు.  

ఆస్తి పన్ను పెంపునకు ఓకే  

►రాష్ట్రంలో ఆస్తి పన్నును పెంచారు. సుమారు 15 నుంచి 30 శాతం వరకు పెరగవచ్చు. కరోనా వల్ల తగ్గిన రాబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రజలపై బాదుడుకు సిద్ధమైంది.  

►నవరి 1వ తేదీ నుంచి యథావిధిగా టెన్త్, పీయూసీ తరగతులు ప్రారంభం.  

►నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సరళంగా  జరుపుకోవాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top