సాగు చట్టాలపై బ్లాక్‌ ఫ్రైడే నిరసన

Shiromani Akali Dal takes out protest march against farm laws - Sakshi

శిరోమణి అకాలీదళ్‌ ఆందోళనతో ఢిల్లీ దిగ్బంధం

పోలీసుల అదుపులో శిరోమణి చీఫ్‌ సుఖ్‌బీర్‌ బాదల్, హర్‌సిమ్రత్‌ కౌర్‌

సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచి్చన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, శిరోమణి అకాలీదళ్‌ బ్లాక్‌ ఫ్రై డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. సాగు చట్టాలు గతేడాది సెపె్టంబర్‌ 17న లోక్‌సభ ఆమోదం పొంది  సంవత్సరం అయిన సందర్భంగా సెప్టెంబర్‌ 17 వ తేదీని బ్లాక్‌ డేగా శిరోమణి అకాలీదళ్‌ జరుపుకుంది.

రైతులతో పాటు పార్టీ కార్యకర్తలు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటుకు నిరసన కవాతు చేపట్టారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటుచేసి వారి ప్రణాళికలను అడ్డుకున్నారు. కాగా శిరోమణి అకాళీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌లతో పాటు నిరసనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగు చట్టాలను విపక్షాలతో పాటు ఎన్‌డీఎ భాగస్వామి శిరోమణి అకాలీదళ్‌ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించింది. హర్‌సిమ్రత్‌ కౌర్‌ కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో రెండు పారీ్టల 27 ఏళ్ల మైత్రి
విచి్ఛన్నమైంది.

చట్టలు రద్దు చేయాలి: అమరీందర్‌
కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలను వెంటనే రద్దు చేయడంతో పాటు రైతులతో చర్చలు జరపాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ శుక్రవారం డిమాండ్‌ వ్యాఖ్యానించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top