breaking news
Fry Day
-
సాగు చట్టాలపై బ్లాక్ ఫ్రైడే నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచి్చన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, శిరోమణి అకాలీదళ్ బ్లాక్ ఫ్రై డే నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. సాగు చట్టాలు గతేడాది సెపె్టంబర్ 17న లోక్‌సభ ఆమోదం పొంది సంవత్సరం అయిన సందర్భంగా సెప్టెంబర్ 17 వ తేదీని బ్లాక్ డేగా శిరోమణి అకాలీదళ్ జరుపుకుంది. రైతులతో పాటు పార్టీ కార్యకర్తలు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటుకు నిరసన కవాతు చేపట్టారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటుచేసి వారి ప్రణాళికలను అడ్డుకున్నారు. కాగా శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌లతో పాటు నిరసనలో పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాగు చట్టాలను విపక్షాలతో పాటు ఎన్డీఎ భాగస్వామి శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించింది. హర్సిమ్రత్ కౌర్ కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. దీంతో రెండు పారీ్టల 27 ఏళ్ల మైత్రి విచి్ఛన్నమైంది. చట్టలు రద్దు చేయాలి: అమరీందర్ కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలను వెంటనే రద్దు చేయడంతో పాటు రైతులతో చర్చలు జరపాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం డిమాండ్ వ్యాఖ్యానించారు. -
ఫ్రై డే
విజయనగరం వ్యవసాయం: జిల్లాలో రోజురోజుకూ ఎండలు మండి పోతున్నాయి. మూడు రోజులుగా ఎండ ప్రచండంగాఉండడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శుక్రవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండలకు తోడు వేడిగాలులు వీయడంతో జిల్లా వాసులు శలభాల్లా మాడిపోయారు. చాలా మంది ఇళ్లకే పరిమితమవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూవాతావరణం నెలకొంది. ఇంతఎండతీవ్రత గతపదేళ్లలో ఎప్పుడూ లేదని శాస్త్రవేత్త పాత్రో తెలిపారు. వడదెబ్బకు బుధవారం ఐదుగురు, గురువారం ముగ్గురు మరణించగా, శుక్రవారం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక, బయటకు వస్తే ఎండవేడిమి భరించలేక జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమవుతోంది. వేడిగాలులు కూడా వీస్తుండడంతో ఆందోళనకు గురౌతున్న జిల్లావాసులు ప్రయాణాలను, బయట పనులను వాయిదా వేసుకుంటున్నారు. పగటిపూట ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. దుకాణాలను కూడా మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి, మళ్లీ సాయంత్రం తెరుస్తున్నారు. శుక్రవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, కొత్తవలస, కురుపాం, చీపురుపల్లి, నెల్లిమర్ల తదితర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమి భరించలేక రోగులు అవస్థలకు గురవుతున్నారు. కేంద్రాస్పత్రిలోని ఎమర్జీన్సీ వార్డు, బర్నింగ్ వార్డుల్లో ఉన్న రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ వార్డుల్లో ఏసీలు ఉన్నప్పటికీ ఉపశమనం ఇవ్వకపోవడంతో రోగి బంధువులు విసనకర్రలు ద్వారా విసురుతూ రోగులకు ఉపశమనం కలిగిస్తున్నారు.