బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం | Sakshi
Sakshi News home page

బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం

Published Fri, Jan 12 2024 6:33 AM

Sheikh Hasina sworn in as Bangladesh PM for fifth term - Sakshi

ఢాకా: అవామీ లీగ్‌ అధినేత్రి షేక్‌ హసీనా(76) గురువారం బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అవామీ లీగ్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు బహిష్కరించాయి.

అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ దేశ 12వ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా నాలుగోసారి, మొత్తమ్మీద అయిదోసారి ఆమె ప్రధానిగా పగ్గాలు చేపట్టినట్లయింది. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement