ప్రధాని ముందే తమిళనాడు డిమాండ్లను వినిపించిన సీఎం స్టాలిన్‌

Sharing The Stage, Tamil Nadu CM Stalin Places Demand Before PM Modi - Sakshi

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ వాదాన్ని వినిపిస్తూ.. ద్రవిడ మోడల్‌ పాలనను యావత్‌ దేశానికి చూపిస్తామన్నారు. అంతేగాక తమిళనాడులో తమిళమే మాట్లాడతామంటూ పేర్కొన్నారు. కేంద్రంతో సంఘీభావంగా ఉంటామంటూనే..రాష్ట్ర డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ గురువారం చైన్నైలో పర్యటించారు. సీఎం స్టాలిన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 31,000 కోట్ల రూపాయలతో 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మోదీ తమిళనాడులో పర్యటించడం ఇదే తొలిసారి.

ప్రధాని ముందు సీఎం స్టాలిన్‌  కొన్ని డిమాండ్లను పెట్టారు. హిందీని కాకుండా తమిళ భాషను అధికారిక భాషగా గుర్తించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాని డిమాండ్‌ చేశారు. తాము నీట్ ప‌రీక్ష‌ను వ్య‌తిరేకిస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును కూడా ప్ర‌వేశ పెట్టామ‌ని గుర్తు చేశారు. హిందీలాగే మద్రాస్‌ హైకోర్టులో తమిళ్‌ను అధికార భాషగా మార్చాలని డిమాండ్‌ చేశారు. మ‌త్స్య‌కారులు స్వేచ్ఛ‌గా చేప‌లు ప‌ట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి క‌చ్చ‌తీవు ద్వీపాన్ని తిరిగి పొందాల‌ని సీఎం సూచించారు. 
చదవండి: రైల్వేస్టేషన్‌లో ఉత్సాహంగా స్టెప్పులేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా!

అనంత‌రం కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య సంబంధాల‌ను ప్ర‌స్తావించిన స్టాలిన్‌.. కేంద్రం నుంచి త‌మిళ‌నాడుకు నిధులు రావ‌డం లేద‌ని ప్ర‌ధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రాల‌కు నిధులు ఇవ్వాల్సిన బాధ్య‌త కేంద్రానిదేన‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రాల‌తో కేంద్ర క‌లిసి ప‌నిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్య‌మ‌ని కూడా ఆయ‌న తెలిపారు. త‌మిళ‌నాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కూడా స‌భా వేదిక‌గానే మోదీని స్టాలిన్ కోరారు.
చదవండి: గవర్నర్‌తో విభేదాలు.. మమత సర్కార్‌ కీలక నిర్ణయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top