గవర్నర్‌తో విభేదాలు.. మమత సర్కార్‌ కీలక నిర్ణయం

West Bengal Govt To Amend Law CM To Be Chancellor State Run Universities - Sakshi

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్శిటీలకు ఇకపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. బెంగాల్ విద్యాశాఖ మంత్రి బర్త్య బసు ఈ విషయాన్ని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై గవర్నర్ జగదీప్ ధన్‌కడ్‌, మమతా బెనర్జీ సర్కార్ మధ్య పలుమార్లు విభేదాలు తలెత్తాయి.

రాజ్‌భవన్‌తో సంబంధం లేకుండా దీదీ సర్కార్ వీసీలను నియమిస్తోందంటూ గవర్నర్ ధన్‌కడ్‌ ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను ఛాన్సలర్ హోదా నుంచి తప్పించాలని మమత నిర్ణయించుకున్నారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టమే తెచ్చింది.
చదవండి👇
మహిళా ఎంపీపై బీజేపీ చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
పెళ్లికి తొందరపడాల్సిందే.. ఉరుకులు.. పరుగులు.. ఆలస్యం చేశారంటే!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top