పెట్రో ధరల తగ్గింపు: శరద్‌పవార్‌ స్పందన

Sharad pawar Says Central Release GST Funds States Reduced Vat On Fuel - Sakshi

పుణె: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించిన నేపథ్యంలో ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ శక్రవారం స్పందించారు. ఆయన పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ నిధులు విడుదల చేస్తే, రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తాయని అన్నారు.

చదవండి: Petrol and Diesel Price : వాహనదారులకు కేంద్రం శుభవార్త..!

సరైన సమయంలో జీఎస్టీ నిధులు రాష్ట్రాలకు బదిలిచేస్తే ఇందన వ్యాట్‌ తగ్గింపుతో పాటు పలు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top