ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం | Severe Cyclonic Storm Crosses Odisha Coast | Sakshi
Sakshi News home page

ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం

Jul 5 2026 9:40 PM | Updated on Jul 5 2026 9:48 PM

Severe Cyclonic Storm Crosses Odisha Coast

విశాఖ : ఉత్తర ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

ఈ వాయుగుండం ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా అల్పపీడనంగా మారిన తర్వాత  ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement