దేవిరెడ్డిపల్లిలో 20 రోజుల్లోనే పెరిగిన మరణాలు

Seven Peoplee Died With Covid In Devireddypalli - Sakshi

బాగేపల్లి: బాగేపల్లి తాలూకా పరగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరెడ్డిపల్లి గ్రామంలో కరోనా విలయతాండవం చేస్తోంది. 20 రోజుల్లో ఏడు మంది చనిపోయారు.  ఏ రోజు ఎవరి ఇంట మృత్యుఘంట వినిపిస్తుందోనని గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా ఉన్నారు.   మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో గ్రామస్తులు ఎవరూ బయటకు రావడానికి జంకుతున్నారు. తొలుత కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు కోరినా పట్టించుకోని వారు ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు చేయించుకుందామా అని చూస్తున్నారు. గ్రామంలో మొత్తం 34 మంది కోవిడ్‌తో బాధపడుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top