అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్‌ | Sensational comments of the Governor of Tamil Nadu | Sakshi
Sakshi News home page

అలా చేస్తే బేరసారాలకు అవకాశం.. తమిళనాడు గవర్నర్‌

May 7 2026 10:31 PM | Updated on May 7 2026 10:31 PM

Sensational comments of the Governor of Tamil Nadu

చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా చూపించాల్సిందేనని ఆ రాష్ట్ర గవర్నర్‌ తేల్చిచెప్పడంతో అక్కడ పొలిటికల్ హీట్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో  ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎమ్మెల్యేల బేరసారలకు పరోక్షంగా అనుమతి ఇవ్వలేమన్నారు.

తమిళనాడు గవర్నర్ తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఆయన తీరును కాంగ్రెస్‌తో పాటు అక్కడి పలువురు నేతలు ఖండించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో E ఆ రాష్ట్రంలోని  ఓ పత్రికకు గవర్నర్‌ ఇంటర్వూ ఇచ్చారు.

విశ్వనాథ్ అర్లేకర్ మాట్లాడుతూ.."మెజారిటీ లేకపోవడం అన్నది ఒక్క విజయ్ సమస్య మాత్రమే కాదు. తమిళనాడు సమస్య మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బేరసారాలకు అనుమతించలేం. విజయ్‌ని మోజారిటీ నిరూపించమని మేము అనలేదు. మోజార్టీతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తాం అని తెలిపాం. కాని వారు అలా చేయలేదు. దీనికి నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఎలా అడ్డుకుంటున్నట్లు. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎస్‌.ఆర్‌ బొమ్మై కేసులోని ఉత్తర్వు దీనికి వర్తించదు" అని అన్నారు.  

కాగా విజయ్‌కు జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీ కల్పించడంపైనా ఆ రాష్ట్ర గవర్నర్‌ డీజీపీపై సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు డీజీపీ శాంతిభద్రతలపై నివేదిక అందించారు. మరోవైపు రేపు గవర్నర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ రేవు రాష్ట్ర వ్యాప్తం ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement