బచ్చన్‌ భవంతులకు భద్రత పెంపు | Security has been increased outside bungalows of Amitabh Bachchan and Jaya Bachchan | Sakshi
Sakshi News home page

బచ్చన్‌ భవంతులకు భద్రత పెంపు

Sep 17 2020 6:33 AM | Updated on Sep 17 2020 6:33 AM

Security has been increased outside bungalows of Amitabh Bachchan and Jaya Bachchan - Sakshi

ముంబై: బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్, ఆయన భార్య, సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్‌కు ముంబైలో ఉన్న బంగళాలకు పోలీసుల రక్షణ పెంచారు. సినీ పరిశ్రమపై బురద చల్లవద్దంటూ జయాబచ్చన్‌ పార్లమెంట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో కంగన, రవికిషన్‌ను జయాబచ్చన్‌ పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమితాబ్‌ ఎక్స్‌ కేటగిరీ భద్రత పొందుతున్నారని, జయాబచ్చన్‌ ప్రసంగానంతరం జుహులో వారి భవంతుల బయట భద్రతను,  పెట్రోలింగ్‌ను పెంచామని పోలీసు అధికారులు చెప్పారు. జుహులో బచ్చన్‌ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరిట మూడు బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షల్లో అమితాబ్‌ కుటుంబం నివశిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement