
ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది.
ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ