
ఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిసి పిటిషన్ పై రేపు(బధవారం) సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్ ఐటం నెంబర్ 86గా సుప్రీంకోర్టులో లిస్ట్ అయ్యింది. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న వైఎస్సార్‌సీపీ.. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా చట్టం రూపొందించారని, ఈ చట్టంతో ముస్లింల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని పిటిషన్ లో పేర్కొంది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే, వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె వి విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది.