పరువు హత్య: డ్రైవర్‌ను ప్రేమించిందని కూతురిని చంపేసిన సర్పంచ్‌! | Sarpanch Murders Daughter And Driver For Falling In Love In Bihar | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ ప్రేమలో సర్పంచ్‌ కూతురు.. రైల్వే ట్రాక్‌పై తేలిన మృతదేహాలు.!

Oct 25 2022 9:24 PM | Updated on Oct 25 2022 9:24 PM

Sarpanch Murders Daughter And Driver For Falling In Love In Bihar - Sakshi

రైల్వే ట్రాక్‌పై డ్రైవర్‌తో పాటు యువతి మృతదేహం లభించటంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు...

పాట్నా: కింది స్థాయి వ్యక్తిని ప్రేమించిందనే కారణంగా సొంత కూతురినే చంపేశారు తల్లిదండ్రులు. యువకుడితో పాటు కూతురిని రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ అమానవీయ సంఘటన బిహార్‌లోని బెగుసరాయ్‌ జిల్లాలో కలకలం సృష్టించింది. యువకుడు వారి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, ఇరువురు ప్రేమించుకున్నారనే కోపంతోనే యువతి తల్లిదండ్రులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత యువకుడు లఖో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజపుర్‌ దుమ్రీ ప్రాంతానికి చెందిన రామ్‌నును పాసవాన్‌(25), యువతి అయోధ్య బారీ గ్రామ సర్పంచ్‌ కూతురు రూపమ్‌ కుమారిగా గుర్తించారు. 

రైల్వే ట్రాక్‌పై డ్రైవర్‌తో పాటు యువతి మృతదేహం లభించటంతో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో గ్రామ సర్పంచ్‌ అయిన యువతి తల్లి అనితా దేవి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. డ్రైవర్‌తో కూతురు ప్రేమలో పడటం ఇష్టంలేని అనితీ దేవీ ఈ హత్యలు చేసినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. యువకుడు చాలా కాలంగా సర్పంచ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ కారణంగానే వారి ప్రేమకు అడ్డు చెప్పారని తెలిపారు. ‘ట్రాక్టర్‌లోని ఇసుకను దించేందుకు సాయం చేయాలని డ్రైవర్‌కు సర్పంచ్‌ అనితా దేవీ సూచించగా.. వారి ఇంటికి వెళ్లాడు రామ్‌నును. ఈ క్రమంలోనే సర్పంచ్‌, ఆమె అనుచరులు దాడి చేసి హత్య చేశారు.’ అని మీడియాకు వెళ్లడించారు. 

మరోవైపు.. ఈ వాదనలను ముందుగా తోసిపుచ్చారు అనితా దేవీ. రామ్‌నును పాసవాన్‌తో కలిసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బుకాయించే ప్రయత్నం చేశారు.‘చాలా కాలంగా మా ఇంట్లో పని చేస్తున్న డ్రైవర్‌తో నా కూతురు ప్రేమలో పడింది. ఆ విషయం తెలిసిన క్రమంలో అతడిని పనిలోంచి తీసేశాం. దీంతో వారు ఇరువురు ఆత్మహత్య చేసుకున్నారు.’అని సర్పంచ్‌ అనితా దేవీ పేర్కొన్నారు. అయితే, వారి ప్రేమను ఓర్వలేకనే సర్పంచ్‌ అనితా దేవీ హత్య చేశారని గ్రామస్థులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Crime: అడిగినంత డబ్బిస్తేనే.. నీ న్యూడ్‌ వీడియో డిలీట్‌ చేస్తా!

Advertisement
 
Advertisement
Advertisement