Govt Regulated Sansad TV Youtube Channel Hacked, Restored After 3 Hours - Sakshi
Sakshi News home page

Sansad TV Youtube Channel: సంసద్‌ టీవీ యూట్యూబ్‌ చానల్‌ హ్యాక్‌

Feb 16 2022 7:20 AM | Updated on Feb 16 2022 9:41 AM

Sansad TV YouTube channel hacked - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసే సంసద్‌ టీవీకి చెందిన యూట్యూబ్‌ చానల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌చేశారు. దీంతో అప్రమత్తమైన యూట్యూబ్‌ సంస్థ.. సమస్యకు కొద్ది గంటల్లోనే చెక్‌ పెట్టింది.

సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంసద్‌ టీవీ యూట్యూబ్‌ చానల్‌ను హ్యాకర్లు హ్యాక్‌ చేసి చానెల్‌ పేరును ఇథీరియం( ఒక క్రిప్టో కరెన్సీ పేరు)గా మార్చారు. హ్యాకింగ్‌ జరిగిన విషయాన్ని ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంసద్‌ టీవీ సంబంధిత అధికారులకు తెలిపామని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఈఆర్‌టీ–ఇన్‌) తెలిపింది. చానెల్‌ హ్యాక్‌కు గురైందని తెలిపే స్క్రీన్‌షాట్‌లను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.  

చదవండి: (ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత)

Advertisement
 
Advertisement
Advertisement