స్పా నిర్వాహకుడిని కిడ్నాప్‌ చేసి దాడి | Saloon Worker Beaten By A Lady In Bengaluru, More Details Inside | Sakshi
Sakshi News home page

స్పా నిర్వాహకుడిని కిడ్నాప్‌ చేసి దాడి

May 31 2025 9:46 AM | Updated on May 31 2025 10:47 AM

Saloon Worker Beaten By A Lady In Bengaluru

ముగ్గురు నిందితుల అరెస్ట్‌  

 యశవంతపుర(కర్ణాటక): సెలూన్, స్పా  నిర్వాహకుడిని  కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడిన  ఘటన బెంగళూరులో జరిగింది. సంజు అనే వ్యక్తి గతంలో స్మిత అనే మహిళ నిర్వహిస్తున్న స్పాలో పనిచేసేవాడు. అనంతరం కొందరితో కలిసి  భువనేశ్వరినగర మొయిన్‌ రోడ్డులో రాయల్‌ చాయ్స్, సెలూన్‌ స్పా ఏర్పాటు చేశాడు. దీంతో స్మిత, కావ్య, మహమ్మద్‌లు  ఈ నెల 29న గురువారం రాత్రి సంజును కారులో ఎక్కించుకొని దాసరహళ్లి మొయిన్‌రోడ్డులో జక్కూరు వైపు  తీసుకెళ్లారు. 

డ్యాగర్, బీర్‌ బాటిల్‌తో దాడి చేశారు. పెట్రోల్‌ పోసి నిప్పు పెడుతామంటూ  బెదిరింపులకు పాల్పడారు. అనంతరం అమృతహళ్లి శారద స్కూల్‌ వద్ద వదిలి వెళ్లారు. ఈమేరకు బాధితుడు అమృతహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement