Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం | Sakshi Breaking News Trending News Morning News Roundup 9th October 2022 | Sakshi
Sakshi News home page

Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Oct 9 2022 10:08 AM | Updated on Oct 9 2022 10:25 AM

Sakshi Breaking News Trending News Morning News Roundup 9th October 2022

ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.

1. దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్‌
కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడలో జరిగిన యువతి దారుణ హత్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దేవకి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. కుప్పం కోసం కుస్తీ: ఫోన్లు చేసినా.. బుజ్జగించినా.. మాకొద్దు బాబూ!
కుప్పంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. గతనెల 23న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అవుతోంది. 30 ఏళ్ల బానిస సంకెళ్లను తెగ్గొట్టి టీడీపీ కేడర్‌ మొత్తం వైఎస్సార్‌సీపీ వైపు చూస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. అంతా గందరగోళం.. థరూర్.. ఓ విఫల ప్రయత్నం.!
కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఒకపట్టాన అర్థం కావు. అంతా తెలిసినట్టుగానే ఉంటుంది. మొత్తం గందరగోళంగా కనిపిస్తుంది. కాంగ్రెస్‌ చీఫ్ ఎన్నిక కూడా ప్రస్తుతం అలాగే తయారైంది. తమకిష్టుడైన ఖర్గేని హైకమాండ్ తరపున బరిలోకి దింపారు. మళ్ళీ ఎవరైనా పోటీ చేయవచ్చని కమ్మని కబుర్లు చెప్పారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.రష్యాకు మరో ఎదురుదెబ్బ
ఉక్రెయిన్‌పై కొనసాగిస్తున్న యుద్ధంలో రష్యాకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించి కొంతభాగం దెబ్బతింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.ఈయనగారిని ఇలాగే వదిలెయ్యకండిరా.. బీజేపీ బాబులూ!
సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ‘కేసీఆర్‌ ఫాంహౌస్‌లో సకుటుంబ సమేతంగా తాంత్రిక పూజలు చేసిండు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ‘4జీ నుంచి 5జీకి ఇలా అప్‌గ్రేడ్‌ అవ్వండి’
సైబర్‌ నేరస్తులు ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. మార్కెట్‌ బూమ్‌ను బట్టి జేబులు నింపుకుంటున్నారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌, ఆధార్‌ కార్డు, బ్యాంకు సర్వీసులు, యూపీఐ పేమెంట్స్‌ ఇలా సందర్భాన్ని టెక‍్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.లాహిరి లాహిరి ‘క్రూయిజ్’లో..!
సముద్రం.. ఎవరినైనా చిన్న పిల్లాడిలా మార్చేస్తుంది! ఎగసిపడే కెరటాల్లా మనసును కేరింతలు కొట్టిస్తుంది!! మరి అలాంటి సముద్రంపై ప్రయాణమంటే... అది కూడా 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్లాంటి క్రూయిజ్లో విహరిస్తే? తేలియాడే నగరంలో చక్కర్లు కొడితే? పోలా... అదిరిపోలా...
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.‘మెగా’ డైరెక్టర్‌తో ‘అక్కినేని’మల్టీస్టారర్‌.. స్క్రిప్ట్‌ రెడీ!
తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్‌ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశారట మోహన్‌  రాజా. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.'ధోని భయ్యాను చాలా మిస్సవుతున్నాం'
రాంచీ అనగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోని. టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్రకెక్కాడు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. వైఎస్సార్‌సీపీ నేత దారుణ హత్య 
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం..
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement