పోలీసులకు రక్షణ కల్పిస్తున్న ‘పాములు’!!.. ఎక్కడ.. ఎవరి నుంచి అంటే..

Rubber Snakes keep this police station safe from menacing monkeys - Sakshi

ఇడక్కి(కేరళ): సమాజంలో శాంతిభద్రతలను కాపాడే రక్షక భటులను వానర దండు నుంచి కాపాడేవారే లేరు. తమిళనాడు సరిహద్దు ప్రాంతం వెంట కేరళలోని అటవీప్రాంతంలోని కుంబుమెట్టు పోలీస్‌ స్టేషన్‌పై కోతుల గుంపులు దూసుకొచ్చి నానా హంగామా చేయడం అక్కడ నిత్యకృత్యమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే పోలీసులకు తమ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో తెలియక తెగ హైరానా పడ్డారు.

వీరికి స్థానికంగా యాలకులు సాగు చేసే ఒక రైతు చక్కని ఉపాయం చెప్పి ఆదుకున్నాడు. చైనా తయారీ రబ్బర్‌ పాములను రంగంలోకి దించారు. కోతుల గుంపులు బీభత్సం సృష్టిస్తున్న పోలీస్‌స్టేషన్‌ పై కప్పుపై, స్టేషన్‌ ప్రాంగణంలోని కూరగాయల తోటలో, స్టేషన్‌ గ్రిల్స్‌కు, చెట్లకు ఇలా పలు చోట్ల రబ్బర్‌ పాములను ఉంచారు. దీంతో పాములను చూసి హడలిపోయిన కోతులు స్టేషన్‌ పరిసరాలకు రావడం మానేశాయని పోలీస్‌స్టేషన్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పీకే లాల్‌భాయ్‌ ఆనందం వ్యక్తంచేశారు.


చాలా సంవత్సరాలుగా స్టేషన్‌ను వేధిస్తున్న ఈ సమస్యకు సర్పాల రూపంలో పరిష్కారం దొరకడం సంతోషకరమని సునీశ్‌ అనే పోలీసు అన్నారు. అడవి జంతువులను హడలగొట్టేందుకే తమ సాగుభూమిలో అమలుచేస్తున్న చిట్కానే వీరికి చెప్పానని ఉదంబన్‌చోళ తాలూకాకు చెందిన ఒక రైతు వెల్లడించారు. 

చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత గడ్డపై..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top