ఈ 6 దేశాల మీదుగా వస్తే ఆర్టీపీసీఆర్ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు..

RTPCR International Passengers Transiting Six High Risk Nations - Sakshi

న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైన విషయం తెలిసిందే. చైనాతో పాటు దక్షిణ కొరియా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, సింగపూర్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనసరి చేసింది.

తాజాగా కేంద్రం మరోసారి ఇందుకు సంబంధించి నూతన ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులు ఎవరైనా ఈ ఆరు  దేశాల మీదుగా ప్రయాణించి వేరే దేశం నుంచి వచ్చినా సరే ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది.

ఈ ప్రయాణికులు 72 గంటలకు మందు తీసిన ఆర్టీపీసీఆర్ రిపోర్టులో నెగిటివ్ వస్తేనే భారత్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే అనుమతి లేదు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వారం రోజుల క్వారంటన్ నిబంధనను అమలు చేస్తోంది.
చదవండి: Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top