బ్యాంకు ఖాతాదారులకి ఆర్‌బీఐ అలర్ట్!

RTGS money transfer facility won t be available for 14 hours on Sunday - Sakshi

మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి, భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి అలర్ట్. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సేవలు ఏప్రిల్ 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు నిలిచి పోనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి బ్యాంకు కస్టమర్లు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవల్ని వినియోగించుకోవచ్చు. నెఫ్ట్ సేవల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదు. పేమెంట్స్ కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వినియోగించుకోవాలనే విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ. రూ.2 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

గతేడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి. భారతదేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్‌టీజీఎస్‌తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్‌బీఐ. 

చదవండి: పసిడి పరుగులకు బ్రేక్!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top