జర్నలిస్టులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Rs 10 Lakhs Ex Gratia For Journalists Who Dies With Covid 19 In Punjab - Sakshi

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

చండీగఢ్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. అయితే, గుర్తింపు పొందిన(అక్రిడిటేటడ్‌‌) జర్నలిస్టులకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు. కాగా, కరోనా బారినపడిన పటియాలాకు చెందిన 28 ఏళ్ల జైదీప్‌ అనే జర్నలిస్టు ఆదివారం మృతి చెందాడు. దైనిక్‌ భాస్కర్‌, దైనిక్‌ సేవా సవేరా గ్రూపులలో పనిచేసిన జైదీప్‌ జర్నలిస్టుగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే సీఎం అమరీందర్‌ జర్నలిస్టు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలనే నిర్ణయించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 44,557 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. ఇప్పటివరకు 1178 మంది వైరస్‌ బాధితులు ప్రాణాలు విడిచారు. 29,145 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,254 యాక్టివ్‌ కేసులున్నాయి.
(చదవండి: ‘టిక్‌టాకర్లతో పాటు మమ్మల్నీ పట్టించుకోండి’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top