ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ రెండో విడత షెడ్యూల్‌ విడుదల

RRB NTPC Phase 2 Exam City and Date Information to be Release - Sakshi

న్యూఢిల్లీ: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రెండో విడుత షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ సీబీట-1 టెస్ట్ 2021 జనవరి 16 నుండి 2021 జనవరి 30 వరకు జరగనుంది. ఈ పరీక్షలో సుమారు 27 లక్షల మంది అభ్యర్థులు పాల్గొననున్నట్లు ప్రకటించింది. ఈ రోజు(జనవరి 6) నుండి పరీక్షా నగరం & తేదీని తెలుసుకోవడంతో పాటు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల కోసం ఉచిత ట్రావెలింగ్ సర్టిఫికెట్‌ను అన్ని ఆర్‌ఆర్‌బి వెబ్‌సైట్లలో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.(చదవండి: వైరలవుతోన్న రతన్‌ టాటా ఫోటో

పరీక్ష తేదీకి 4 రోజుల ముందు ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. 2వ దశలో షెడ్యూల్ చేసిన అభ్యర్థులందరికీ వారు ఆన్‌లైన్ దరఖాస్తులో ఇచ్చిన ఇ-మెయిల్, మొబైల్ నంబర్లకు ఈ సమాచారాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన అభ్యర్థులకు సంబందించిన పరీక్షలను తదుపరి దశలో వెల్లడించనున్నట్లు ఆర్‌ఆర్‌బి పేర్కొంది. మిగతా సమాచారం కోసం ఆర్‌ఆర్‌బి ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ వీక్షించండి. ఆర్‌ఆర్‌బి ఎన్‌టిపీసీ నోటిఫికేషన్‌ ద్వారా 35,208 పోస్టులను భర్తీ చేయనున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top