Clouded Leopard: బెంగాల్‌ అడవుల్లో అత్యంత అరుదైన క్లౌడెడ్‌ లెపార్డ్‌, ఫోటో విడుదల

Rare Clouded Leopard Buxa Tiger Reserve Pics Surfaced - Sakshi

అత్యంత అరుదైన క్లౌడెడ్‌ లెపార్డ్‌ బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఇటీవల కనిపించింది. పశ్చిమబెంగాల్‌ అటవీశాఖ గురు­వారం ఆ చిరుత ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా గుండా  హిమా­లయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు... ఇప్పుడు అక్కడా అంతరించిపోతున్నాయి. దీంతో 1980 నుంచి ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి.

అయినా అవింకా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలాంటి సమయంలో బుక్సా టైగర్‌ రిజర్వ్‌లో ఈ చిరుత ఇలా కెమెరా ట్రాప్స్‌ కంట పడటంతో... ‘అంతర్జాతీయ క్లౌడెడ్‌ లెపార్డ్‌ డే’ సందర్భంగా ఆగస్టు 4న బెంగాల్‌ అటవీ అధికారులు ఆ ఫొటోను షేర్‌ చేశారు. ఈ చిరుత గర్జించలేదట. అలాగని పిల్లిలా కూతలు కూయదట. మధ్యస్థంగా ఉంటుంది. పిల్లలు వెంట ఉన్నప్పుడు, భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రమే ఆగ్రహంతో ఉండే క్లౌడెడ్‌ లెపార్డ్‌... మిగతా సమయాల్లో సాధు జంతువంటే నమ్మండి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top