ప్రాణాలు తీసిన వందేభారత్‌ రైలు-ఆవు ప్రమాదం.. మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తిపై పడటంతో!

Rajasthan: Vande Bharat Train Cow Collision Leads Elderly Man Dies - Sakshi

జైపూర్‌: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన వందే భారత్‌ రైలు ప్రారంభం నుంచే పలు సవాళ్లు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆకతాయిలు రైళ్లపై రాళ్లతో దాడి చేయగా.. మరికొన్ని చోట్ల ప్యాసింజర్లు చెత్తా చెదారం పడేసిన వార్తలొచ్చాయి. మరికొన్ని చోట్ల సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో పశువులు రైళ్లకు అడ్డుగా వచ్చి మృత్యువాత పడ్డాయి. 

తాజాగా రాజస్తాన్‌లో ఓ ఆవు వందే భారత్‌కు అడ్డుగా వచ్చి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. ఆవు శరీర భాగాలు బలంగా ఢీకొట్టడంతో ఆ సమీపంలో  మూత్రవిసర్జన చేస్తున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అల్వార్‌లోని అరవాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న వందే భారత్‌ రైలు ఆవును ఢీకొనడంతో, దాని శరీర భాగాలు ఛిద్రమై 30 మీటర్ల దూరంలో మూత్రవిసర్జన చేస్తున్న శివదయాల్‌ శర్మపైపడి అతను అక్కడికక్కడే మృతి చెందడం కలచివేసింది.
చదవండి: కోహ్లీ-గంభీర్ గొడవకు రాజకీయ రంగు.. ఎన్నికల్లో బుద్ధిచెబుతామంటున్న కన్నడిగులు..!

రైలును ఢీకొనడంతో.. ఆవు శరీర భాగం దూరంలో ఉన్న శివదయాల్‌పై పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు భారతీయ రైల్వేలో 23 ఏళ్లు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యాడని పోలీసులు తెలిపారు. శివదయాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని వెల్లడించారు. ఇదిలా ఉండగా సెమీ హై స్పీడ్‌ వందే భారత్‌ రైళ్లు ఆవులు, గేదెలను ఢీకొన్న సంఘటనలు ఎక్కువ శాతం ముంబాయి-గుజరాత్‌ రైల్వే లైన్‌లో జరిగినట్టుగా ఓ నివేదిక పేర్కొంది.
చదవండి: ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్‌ఐఏ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top